భూమి ఎలా ఏర్పడింది..? భూమిపైన జీవం ఎలా వచ్చింది #telugusmartthinking #facts #telugu #space #earth
ఈరోజు మనం చూస్తున్న భూమి ఇలా ఉండేది కాదు,
కేవలం జీవకోటి అవిర్భవించడానేకే అన్నట్టు తనని తాను రూపాంతరం చెందించుకుంటూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మనం చూస్తున్న ఈ భూమి అందంగా తయారయింది.
ఈరోజు మనం భూమి ఏర్పడక ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఆ తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా చూద్దాం.
సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం మహా విస్ఫోటనం (Big Bang) జరిగిన తరువాత, విశ్వం క్రమంగా చల్లబడతూ విస్తరించడం ప్రారంభించింది. కాలక్రమేణా, తేలికపాటి మూలకాలు (elements) ఏర్పడ్డాయి, తరువాత నక్షత్రాలలో nuclear fusion వల్ల అనేక పేలుళ్ళు జరిగాయిదాని వల్ల భారీ మూలకాలు ఏర్పడ్డాయి. మన సూర్యుడు మరియు సౌర వ్యవస్థ ఏర్పడిన ప్రాంతం ఒకప్పుడు ఈ నక్షత్రాల పేలుళ్ళు జరగడం ద్వారా ఏర్పడిన ధూళి మరియు వాయువులతో నిండి ఉండేది. ఈ ప్రాంతాన్నే సౌర నీహారిక (Solar Nebula) అంటారు.
గురుత్వాకర్షణ శక్తి తన పనిని ప్రారంభించడంతో, ఈ నీహారికలోని పదార్థం కేంద్రం వైపు ఆకర్షించడం మొదలైంది. ఈ ఆకర్షణ భ్రమణ వేగాన్ని పెంచింది, ఇలా పదార్థమంతా కేంద్రం వైపు ఆకర్షించడం వల్ల, ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత పెరగడంతో, న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి సూర్యుడు జన్మించాడు.
సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు..? ఏర్పడడానికి ముందు ఎలాంటి సంఘటనలు జరిగాయి..? అనే టాపిక్ మీద నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది వెళ్లి చూడండి.
సూర్యుడి చుట్టూ మిగిలిన పదార్థం ఒక చదునైన డిస్క్‌లా ఏర్పడింది, దీనినే ప్రోటోప్లానెటరీ డిస్క్ (protoplanetary disk) అంటారు.
గ్రహాల నిర్మాణం - ఒక కాస్మిక్ ప్రమాదం మరియు పరిణామం:
ఈ ప్రోటోప్లానెటరీ డిస్క్‌లో, ధూళి మరియు మంచు కణాలు ఒకదానితో ఒకటి అతుక్కోవడం ప్రారంభించాయి, ఆ తర్వాత చిన్న చిన్న గుంపులుగా మారాయి. ఈ ప్రక్రియను అక్రెషన్ (accretion) అంటారు. ఈ చిన్న గుంపులు, కొన్ని మీటర్ల నుండి కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న గ్రహాంశాలుగా (planetesimals) మారాయి. ఈ గ్రహాంశాలు పరస్పరం ఢీకొంటూ, ఒకదానితో మరొకటి కలసిపోయి మరింత పెద్ద గ్రహాలుగా మారాయి. ఇలా భూమితో పాటు అనేక గ్రహాలు, గ్రహశకలాలు, ఉపగ్రహాలు ఏర్పడ్డాయి. ఇదంతా ఒక్క రోజుల్లో ఒక సంవత్సరంలో జరగలేదు కొన్ని బిలియన్ సంవత్సరాల పాటు ఈ యొక్క చర్య కొనసాగింది.
ఇప్పుడు భూమి ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం.
మొదట భూమి ఏర్పడే నాటికి పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేది. ఆ సమయంలో అనేక గ్రాశకలాలు భూమిని ఎప్పుడు డి కొడుతూ ఉండేవి. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అంగారకుడి పరిమాణంలో ఉన్న థియా (Theia) అనే ఒక ఖగోళ వస్తువు భూమిని ఢీకొనడం వల్ల భూమి రెండు భాగాలుగా చీలిపోయింది. ఈ చీలిపోయిన భాగం తిరిగి కలిసి మన చంద్రుడు (Moon) గా ఏర్పడింది అని శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఈతాకిడి వల్ల భూమి భ్రమణ వేగం తగ్గిపోయింది. మరియు భూమి ఒక వైపుకు ఒంగి తిరగడం ప్రారంభించింది దీనివల్ల భూమిపై రుతువులు ఏర్పడ్డాయి.
భూమి చల్లబడటం ప్రారంభించినప్పుడు, దాని లోపలి నుండి వాయువులు విడుదలయ్యాయి. అగ్నిపర్వతాల (volcanoes) నుండి వెలువడిన నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, అమ్మోనియా వంటి వాయువులు భూమి యొక్క తొలి వాతావరణాన్ని (early atmosphere) ఏర్పరిచాయి. ఈ వాతావరణం ప్రస్తుతంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేది, అప్పటికి ఆక్సిజన్ దాదాపుగా లేదు.
ఈ సమయంలోనే లక్షల కొద్ది తోకచుక్కలు భూమిని అదేపనిగా ఢీ కొడుతూ ఉండేవి. ఇలా ఢీ కొట్టిన ప్రతిసారి వాటిలో ఉండే మంచు కరిగిపోయి నీటిలా మారి భూమిపై నిండిపోయింది. సూర్యుని యొక్క వేడితో పాటు గ్రహ శకలాల యొక్క తాకిడి వల్ల భూమి మీద ఉన్న నీరు నీటి ఆవిరిగా మారి వాతావరణంలో కలిసిపోయింది.
భూమి మరింత చల్లబడినప్పుడు, వాతావరణంలోని నీటి ఆవిరి వర్షంగా కురిసి భూమి యొక్క ఉపరితలంపై నీటిని నింపింది. అలా మొదటి సముద్రాలు (oceans) ఏర్పడ్డాయి.
జీవం యొక్క అంకురం - ఒక అద్భుతమైన పరిణామం:
సముద్రాలు ఏర్పడిన తరువాత, భూమిపై జీవం ఎలా పుట్టిందనేది ఒక గొప్ప రహస్యం. అయితే, శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఒక సిద్ధాంతం ప్రకారం, సముద్రాలలోని అగ్నిపర్వతాల వెన్స్ దగ్గర ఉండే సమతుల్య వాతావరణం, వాటి నుండి విడదలైయ్యే వివిధ మూలకాలు ఒకదానితో ఒకటి రసాయన చర్యలు జరపడం వల్ల సంక్లిష్టమైన అణువులు ఏర్పడ్డాయి, ఇక్కడే మొదటి ఏకకణజీ ఏర్పడింది. ఆ తర్వాత ఇవి భహుకన జీవులుగా అభివృద్ధి చెంది మొదటి జీవి ముద్రలలో ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెప్పారు.. మరొక సిద్ధాంతం ప్రకారం, అంతరిక్షం నుండి వచ్చిన అనేక మెటరాయిడ్స్, ఉల్కలు ద్వారా వచ్చిన సేంద్రియ అణువులు (organic molecules) భూమిపై జీవం యొక్క పుట్టుకకు సహాయం చేశాయని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయం. ఏది ఏమైనాప్పటికీ మొదటి జీవి ఏర్పడడానికి ఎన్నో సంక్లిష్టమైన చర్యలు జరిగాయి అన్నది మాత్రం నిజం
అయితే మొట్టమొదటి జీవులు చాలా సరళమైనవి, ఏకకణ జీవులు (single-celled organisms). కాలక్రమేణా, ఈ జీవులు పరిణామం చెంది మరింత సంక్లిష్టమైన జీవరాశులుగా అనగా మల్టీ సెల్లో ఆర్గానిజమ్స్ గా అభివృద్ధి చెందాయి. ఆ సమయంలో భూమిపై కిరణజన్య సంయోగక్రియ (photosynthesis) అభివృద్ధి చెందడంతో, వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడం ప్రారంభమైంది. దీనివల్ల సముద్రాలలో నుండి జీవులు భూమి పైకి రావడానికి ప్రయత్నించాయి. ఆ తర్వాత ఇవి భూమిపై మరింత సంక్లిష్టమైన జీవాలు గా రూపాంతరం చెందాయి.
భూమి - ఒక డైనమిక్ గ్రహం:
భూమి మిగతా గ్రహాలలా కాకుండా తనని తాను రూపాంతరం చెల్లించుకుంటూ కొత్త కొత్త ప్రదేశాలను ఏర్పరిచింది. దీనికి కారణం భూమి పొరల్లో ఉండే టెక్టోనిక్ ప్లేట్లు (tectonic plates) ఇవి నిరంతరం కదులుతూ ఉంటాయి, దీనివల్ల ఖండాలు, పర్వతాలు ఏర్పడ్డాయి. అయితే ఈ కదలికల వల్ల భూకంపాలు సంభవించేవి, అగ్నిపర్వతాల విస్ఫోటనం జరిగేది. ఈ ప్రక్రియలు అన్ని భూమి యొక్క ఉపరితలాన్ని మరియు వాతావరణాన్ని నిరంతరం మారుస్తూ ఉండేవి.
అయితే వాతావరణంతో పాటు సముద్రాలు కూడా భూమి మీద జీవావరనాన్ని ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించాయి.సముద్రాలు ఉష్ణోగ్రతలను నియంత్రించేవి, జీవానికి అవసరమైన అనేక రసాయన ప్రక్రియలు ఈ సముద్రాలలోనే జరిగేవి. ఇలా భూమి యొక్క ఆవిర్భావం జరిగింది.
భూమి యొక్క ఈ సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన ప్రయాణం మనకు విశ్వం యొక్క అద్భుతాలను మరియు జీవం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఒకప్పుడు కేవలం ధూళి మేఘంగా ఉన్న మన గ్రహం, ఎన్నో కాస్మిక్ సంఘటనలు మరియు భౌతిక ప్రక్రియల ద్వారా నేడు జీవంతో నిండిన ప్రపంచంగా మారింది. ఇది కథ కాదు నిజంగా జరిగిన అద్భుతమైన భూమి చరిత్ర. ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.
కానీ ఇప్పుడు కేవలం మనుషుల వల్లనే ఈ భూమికి అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
సేవ్ ఎర్త్ సేవ్ నేచర్.

Comments
Post a Comment